![Harish-Rao_6838](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2021/10/Harish-Rao_6838-696x321.jpg)
టిఆర్ఎస్ లో గరం గరం
కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం
-హుజురాబాద్ ఎన్నికలే ఆలస్యం తదుపరి టిఆర్ఎస్ల్ లో ముసలం పుడుతుందని, కారులో తిరుగుబాటు మొదలవుతుందని టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు
అందుకోసమే ప్లీనరీలో గర్జనలు పెడుతుందని అన్నారు. ఈటెల రాజేందర్ ను బయటకు పంపి నట్టే మంత్రి హరీష్ రావును కూడా బయటకు పంపేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ పథకాన్ని రచించారని అన్నారు. త్వరలోనే హరీష్ రావు ను
కలిసి ఉంటానని అని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత హరీష్ కు అడుగు అడుగునా అగ్నిపరీక్షే నని అందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈటెల రాజేందర్ ఓడిపోయిన గెలిచినా ఎవరికీ లాభం లేదని, ఇది ముందుగానే అందరూ ఊహించిందేనని అన్నారు. ముందస్తుకు వెళ్లనని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
గుజరాత్తోనే తెలంగాణా లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. మోడీ సూచనల మేరకే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళను న్నాడని రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే పథకం నడుస్తుందని అన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మరోమారు ఋజువైంది, దళిత ద్రోహి నాయకత్వంలోనే మరో దళిత నాయకుడు చేరాడాని మోత్కుపల్లి నర్సింహులు ఉద్దేశించి అన్నారు.