ట్రాక్టర్ ఇనప చక్రాలతో తారు రోడ్డు పైకి వస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్ పి
మెదక్ యదార్థవాది ప్రతినిధి
ట్రాక్టర్ లకు ఇనప చక్రాలతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లపై నడిపడంతో రోడ్లు చెడిపోతున్నాయి ఇకపై రోడ్లపైకి ఇనప చక్రాలతో వస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి అన్నారు. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరిగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని కొందరు ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పని చేయడానికి ఇనప చక్రాలను ఉపయోగిస్తారు. వీటితో రోడ్లపై రావడం వల్ల రోడ్లు ద్వంసం అవడంతో ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనుల వాడాలి తప్ప రోడ్డుపైకి వస్తె ట్రాక్టర్ యజమానులపై మోటారు వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రకటనలో తెలిపారు.