21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

జగిత్యాల యదార్థవాది

ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు.. మంగళవారం జగిత్యాల జిల్లా పట్టణంలో పోలీస్ సేఫర్ ఇండియన్ రోడ్, ఇండియన్ యూత్ సెక్యూలర్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన నిబంధనలు పాటించే వారికి బహుమతుల ప్రధానంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యతగా తీసుకున్నప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న గమ్యం చేరడం ముఖ్యం కానీ వేగం కాదు.. ఒకటి రెండు నిమిషాల్లో ముందు మాత్రమే చేరుకోగలమని కానీ అది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నిండు జీవితం బలి కావడం జరుగుతుందని వీలైనంతవరకు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. దురదృష్టవంతు ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణం చెందుతున్నారని ముఖ్యంగా సాయంత్రం నుండి రాత్రి పది గంటల వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున యువత వాహన వేగాన్ని నియంత్రణతో నడిపలని తెలిపారు. ట్రాఫిక్ నియమ అలా గూర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎన్జీవో ఓజాను ఎస్పీ అభినందించారు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పిలు వెంకటస్వామి, రవీందర్ రెడ్డి, జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నటేష్, రఫీ ఖాన్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్