డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలి: మంత్రి ఎర్రబెల్లి
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
వరంగల్ ముద్దు బిడ్డ, మేధావి, బడుగు, బలహీన వర్గాల నాయకుడు బండ ప్రకాష్ తనకున్న రాజకీయ అనుభవం, పరిజ్ఞానంతో డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలని, తెలంగాణ శాసన మండలి ప్రతిష్టను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా విశేషమైన సేవలు అందించి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం గొప్ప అవకాశం అన్నారు. వరంగల్ ముద్దుబిడ్డ శ్రీ బండ ప్రకాష్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నతమైన సేవలు అందించి ఆ పదవికి, తెలంగాణ శాసన మండలికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అభినందించిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి, అరురీ రమేష్, యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మండలి మాజీ చీఫ్ విప్ బొడేకుంటి వెంకటేశ్వర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు సమ్మారావు, వరంగల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.