తుఫాన్ బీభత్సంతో విమానాల రాకపోకలకు అంతరాయం!
ముంబై యదార్థవాది ప్రతినిది
అరేబియా సముద్రంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం సృష్టించడంతో ముంబైలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుపాను తీవ్రత పెరగడంతో ముంబైలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి వందలాది మంది ప్రయాణికులు తము ప్రయాణించే విమానాల కోసం గంటల తరబడి నిరీక్షించడంతో ముంబై విమానాశ్రయంలో ఆందోళన, గందరగోళం నెలకొంది. వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దవడంతో పాటు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాల ల్యాండింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. కాగా.. ఈ అసౌకర్యంపై కొందరు ప్రయాణికులు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, రన్ వేను తాత్కాలికంగా మూసివేయడంతో ముంబై నుంచి నడిచే కొన్ని విమానాలు ఆలస్యమవుతాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ముంబై విమానాశ్రయంలో రన్ వే 09/27ను తాత్కాలికంగా మూసివేయడం వల్ల కొన్ని కొన్ని విమానాలు ఆలస్యం అవుతాయి. మరి కొన్ని విమనాలు రద్దు అయ్యాయి. మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. అంతరాయాలను తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.