సిద్దిపేటలో దసరా వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట కోటి లింగేశ్వర స్వామి క్షేత్రం లో ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శమీ వృక్షానికి పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు ఆలయ ప్రధాన వైదికులు దసరా పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. అందరికీ శమి వృక్షం అనగా మహాభారత కాలంలో అర్జునుడు ఆయుధాలు దాచిందే ఎక్కువగా తెలుసునని, కానీ శమి వృక్షం అనగా అగ్నికి చిహ్నమని, విజయానికి గుర్తు అని చెప్పారు. కాగా నర్సాపూర్, రంగాధంపల్లీలో కూడా వేడుకలు జరిగాయి