19.2 C
Hyderabad
Thursday, February 5, 2026
హోమ్తెలంగాణదివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం తగదు: జిల్లా కలెక్టర్

దివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం తగదు: జిల్లా కలెక్టర్

దివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం తగదు: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

జిల్లా దివ్యాంగులకు రుణాల మంజూరు విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధి పొందే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా దివ్యాంగుల సాధికారికత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు బ్యాక్ లాగ్ వేకెన్సీ లు అన్నింటిని త్వరగా భర్తీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ విషయంలో సదరంలో ఉండి పెన్షన్ తీసుకుంటున్న విద్యాశాఖ నుంచి వివరాలను తీసుకొని అందరికీ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్లు అందేవిదంగా చూడాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. దివ్యాంగులకు ఇచ్చే బ్యాంకు లోన్ల విషయంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రతి ఒక్కరికి తొందరగా రుణాలు మంజూరు అయ్యేలాగా చూడాలని జిల్లా పరిశ్రమల కేంద్రం టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించి దివ్యాంగులకు నైపుణ్యాలు పెంపొందించి వారు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు పొందడానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు సహాయపడడానికి ప్రతి ఒక్కరూ వితోదికంగా కృషి చేయాలని దివ్యాంగుల పట్ల వివక్ష చిన్న చూపులేకుండా వుండాలని ఎవరైనా వారి పట్ల వివక్ష చూపించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం జిల్లా కార్మికశాఖ అధికారి ఎండీ.రఫీ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు జీసీడీఓ పద్మజ డీసీపీఓ స్వర్ణలత చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి కమిటీ సభ్యులు పున్నం చందర్ ఖాజా మోయినొద్దీన్ ఈశ్వర్ మామిడాల నరేష్ కోడం శ్రీనివాస్ మామిడి పరుశురాములు గోగికారి రాము తిరుపతి వినయ్ కుమార్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్