27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్నాడు ఏం చెప్పాడు..? నేడు ఏం చేస్తున్నాడు...!

నాడు ఏం చెప్పాడు..? నేడు ఏం చేస్తున్నాడు…!

అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశంలో అన్ని రాష్ట్రలు పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పెట్రోల్ ధరల అంశంపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీ లో చేసిన ప్రసంగం, అలాగే పాదయాత్ర లో వివిధ సందర్భాల్లో పెట్రోల్ ధరలపై చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగ్లు చూపించారు. అప్పట్లో పెట్రోల్ బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరల్ని చంద్రబాబు నాయుడు మీడియా ప్రదర్శించారు. దేశంలో పెట్రోల్ డిజిల్ అధిక ధరలు ఉన్న రాష్ట్రం రాజస్థాన్ అని, తర్వాత స్థానం ఆంధ్ర ఏం అని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఒక ఆంధ్ర లో మాత్రమే అత్యధిక రేటు ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు చాడ తేడా ఉందిని, ఇది తుగ్లక్ పాలన కాక మరి ఏంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు ఏడు రూపాయలు వరకు తగ్గించాలని కానీ ఆంధ్రాలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించే ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం.. అప్పులు చేయడం మినహా ఏపీలో పాలన లేదన్నారు. అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఇదేమి మీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదన్నారు. పెట్రోల్ ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పులపాలవుతున్నారు. ఒకపక్క విధ్వంసం.. మరోపక్క ప్రజలపై పన్నుల భారం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్