29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు..

నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు..

నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు..

యదార్థవాది ప్రతినిది శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాన్ శుక్రవారం పత్రిక సమవేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని, ఎవరిని మోసం చేయడానికి ఈ పాదయాత్ర ప్రారంభించారో చెప్పాలని తెలిపారు. పాదయాత్ర చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనలాగే పాదయాత్ర చేసి సీఎం కావాలనుకోవడం చంద్రబాబు, లోకేష్ లు పగటి కలలు కనడమేనని, రాజధాని పేరుతో 33 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మీ నాన్న చంద్రబాబు పన్నాగం పన్నారన్నారు. ఐదేళ్లలో ఐదు కళ్యాణ మండపాలు మాత్రమే నిర్మించి ఇదే రాజధాని నిర్మాణాలు అంటూ చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టిడిపికి దశా,దిశా లేదన్నారు. పాదయాత్ర చేయడానికి మీకున్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. లోకేష్ సీఎం అభ్యర్థినా మీ నాన్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థ.. లేక చంద్రబాబు నాయుడు అభ్యర్ధ.. అసలు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని మండి పడ్డారు. ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ ఒక్క ఉద్యోగం వేసావా ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోలేక గుంపులుగా జోడీలు కట్టి వస్తున్నారని, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజాభిమానం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. టిడిపి 175 స్థానాల్లో పోటీ చేస్తుందా లేక ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కి 50 స్థానాలకి అవకాశం ఇస్తారా అన్నది చెప్పాలన్నారు. నాలుగేళ్లలో టెక్కలి నియోజకవర్గ సమస్యలపై ఎంత మేర దృష్టి సారించారో అచ్చెన్నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు అచ్చెన్నాయుడు ఎక్కడున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్