28.2 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణనిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తాం.

నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తాం.

నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తాం.

* గౌరవెల్లి భూనిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం 

* అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

* రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నిరుపేదలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాల పై దరఖాస్తులను స్వీకరించి రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎంపికై పార్టీ ఆదేశాలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ లాగే నేను మీ వాడినే మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించే బాధ్యత నాదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు గ్యారెంటీలు  అమలు చేశామని డిసెంబర్ 28 నుండి ప్రజా పాలన కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ గ్యారంటీ లపై దరఖాస్తులను స్వీకరిస్తున్నాము నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో  ప్రభుత్వం ఉందని ప్రభుత్వం వచ్చిన నెల రోజులలోనే  420 అని విమర్శించడం తగదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే హుస్నాబాద్ మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం సిడిఎంఏ అధికారుల బృందం నిన్ననే హుస్నాబాద్ కు వచ్చి పరిశీలించిందని అన్నారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగు నీరు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి విఫలమయరని అందుకే కెసిఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించాలని కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఆర్డీఓ బెన్ షాలేం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ఏసీపీ సతీష్ మున్సిపల్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్ పద్మ ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్