నిధుల అవకతవకలపై లోకాయుక్త సీరియస్
*సర్పంచ్ ఉప సర్పంచ్ లకు నోటీసులు
*కిష్టంపేట గ్రామ కార్యదర్శి నుండి 87,504 రికవరీ
* 42,17,121 నిధుల అవకతవకలపై లోకాయుక్త కు సీసీఆర్ ఫిర్యాదు
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా కోమరవేల్లి మండలం కిష్టంపేట గ్రామ పంచాయితీ లో నిధుల గోలమాల్ పై లోకాయుక్త సీరియస్ అయ్యిందని సీసీఆర్ సంస్థ జిల్లా బాద్యులు గుండ్ల శివ చంద్రం, స్టేట్ మీడియా కో ఆర్డినటర్ సాజిద్ తెలిపారు మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో వారు. వివరాలు తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ సభ్యులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత సంవత్సరం ఆర్ టి ఐ చట్టం ద్వారా గ్రామ పంచాయితీ రికార్డుల తనిఖీలు నిర్వహించామని, నిధుల అవకతవకలపై జిల్లా పంచాయితీ అధికారి, లోకాయుక్త కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని జిల్లా పంచాయితీ అధికారికి కి లోకాయుక్త నోటీసులు జారి చేయడంతో ఎంక్విరీ ప్రారంభించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీ వద్ద ఉన్న 87,504 రూపాయలను రికవరీ చెసినట్టు జిల్లా అధికారి లోకాయుక్త కు తెలిపారు. అలాగే 46,17,121 రూపాయల నిధుల వినియోగం పై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినట్టు జిల్లా అధికారి లోకాయుక్త కు తెలిపారన్నారు. వారు స్పందించని యెడల వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు రాజు. ఇలియసుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి,రాజయ్య ,ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.