నీచపు రాజకీయాలు చేయద్దు: బీఎస్పి
బీఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష.
పెద్దపల్లి యదార్థవాది
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో 41వ రోజు మన ఊరు – మన ఉష కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష గడపగడపకు ఏనుగు గుర్తును ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాల దోపిడీని ఎండగడుతూ, ప్రజల వద్దకెళ్లి సమస్యలను తెలుసుకుంటూ బీఎస్పీ ప్రభుత్వంలోకి వస్తే అందించే పథకాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కొంతమంది అనుచరులతో నీచపు, దుర్మార్గపు రాజకీయాలు చేపిస్తున్నారని పోత్కపల్లి గ్రామంలో ఎంతోమంది బీఎస్పీ పార్టీకి ఆకర్షితులై వస్తుంటే డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, బీసీ బందు, పెన్షన్లు నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బీఎస్పీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయని, గత తొమ్మిది ఏళ్లలో ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఈ చేతగాని ప్రభుత్వానికి ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ పూరెల్ల స్వప్న గౌడ్, నియోజకవర్గ కోశాధికారి ఎండి రియాజ్, బీఎస్పీ మండల కో-కన్వీనర్ మేకల శోభ, బీఎస్పి నాయకులు కళ్యాణ మహేష్, బోయ సాది, స్థానికులు ఎండి మోహిన్, సతీష్, ఎండి పాష, మానస, లక్ష్మీ, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.