నేటి నుండి చిన్నజాతర..
యదార్థవాది ప్రతినిది మేడారం
ఆదివాసీ సంప్రదాయాలతో బుధవారం నుంచి శనివారం వరకు మేడారంలో వైభవంగా నిర్వహింస్తున్నారు. రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తుంటారు. తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగనే చిన్నజాతరగా పిలుస్తారు. దీన్ని ఈ సారి ఆదివాసీ సంప్రదాయాలతో బుధవారం నుండి శనివారం 4వ తేదీ వరకు మేడారంలో వైభవంగా నిర్వహింస్తున్నారు.. సమ్మక్క, సారలమ్మ ఆలయాలతో పాటు గద్దె ప్రాంగణాలను అలంకరించి సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.82 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, విడిది గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పోలీసు బందోబస్తు, తదితర పనులు అధికారులు పూర్తిచేశారు. హనుమకొండ బస్టాండు నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సును ఉదయం 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని టి ఎస్ ఆర్ టి సి అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి తరలిరానున్నారు.