30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణపద్మశాలి ఘనంగా పోచమ్మకు బోనాలు. 

పద్మశాలి ఘనంగా పోచమ్మకు బోనాలు. 

పద్మశాలి ఘనంగా పోచమ్మకు బోనాలు. 

కొండపాక యదార్థవాది 

మండల పరిధిలోని దుద్దెడలో  గ్రామదేవతలైన ముత్యాల పోచమ్మ, దూసకుంట నల్ల పోచమ్మ లకు మార్కండేయ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బోనాలు సమర్పించారు. అంతకుముందు ఇరువురు అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా మోగ్గంపై చీరను నేశారు. ఈ శోభాయాత్ర పార్టీలకతీతంగా ఊరేగిస్తూ భక్తిశ్రద్ధలతో నేతన్నలు చీరను నేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించారు. కాగా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి, బారాస నేత, రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి శోభాయాత్రలో పాల్గొని చీరను  అమ్మవారికి ముడుపు కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి గజ్వేల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ గ్రామ నాయకులు సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ గౌడ్ ఎంపీటీసీ గురజాడ బాలాజీ ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్