పసుపు రైతులను ఆదుకోవాలి..
నిజామాబాద్: యదార్థవాది ప్రతినిది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు.. పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, 2019 పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన రైతులు సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి పసుపు కు మద్దతు ధర లేక నష్టపోతున్నామని, ఇప్పటికైనా పసుపు రైతులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర క్వింటాలుకు రూ. 15000 ప్రకటించాలని, ఎర్రజొన్న రైతులు చేసిన విధంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని తెలిపారు. క్వింటాల్గు 6000 రూపాయల కంటే ఎక్కువ రావటం లేదు, ప్రక్కనున్న రాష్ట్రాలు ఇచ్చినట్లు క్వింటాల్కు మూడు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని లేకుంటే ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగనియ్యమని పసుపు రైతులు తెలిపారు. ఈ విషయంలో ఎంపీ అరవింద్ రైతులకు మేలు చేయలని తెలిపారు. ఈ సమావేశంలో కొమ్ముల సంతోష్, పడిగల ప్రవీణ్, బద్దం సురేష్, తిరుపతి వన్నెల్, సంటి లింగారెడ్డి, సంటోల్ల గంగారెడ్డి,
గంగారెడ్డి ,సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.