మున్సిపల్ కమిషనర్. పాఠశాల ప్రిన్సిపల్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
యదార్థవాది బ్యూరో
అభం శుభం తెలియని చిన్నారులను మున్సిపల్ కు చెందిన వాహనంలో తరలిస్తున్న విషయం ప్రశ్నించినందుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు గురువారం సిద్దిపేట పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో 18 ఏళ్ల లోపు విద్యార్థులను కంటి వెలుగుకు కిక్కిరిసిన వాహనంలో తరలించినందుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి బాలికల రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుప్రియ లపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి, దరిపల్లి చంద్రం, సూర్య వర్మలు మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు కంటి వెలుగు అర్హులని ప్రభుత్వం చెబుతుందని దీనిపై ప్రశ్నించినందుకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేసులకు అరెస్టులకు ఎప్పుడు భయపడదని తెలిపారు. వాహనంలో తరలించే క్రమంలో విద్యార్థులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహించే వారిని అప్పుడు ఎవరిపై కేసులు నమోదు చేసే వారని ప్రశ్నించారు. విధుల దుర్వినియోగానికి పాల్పడిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, బాలికల రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుప్రియ లపై నాన్ బేయిలేబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు మూడు రోజుల్లో వారి కార్యాలయం వద్ద, అరెస్టు చేయకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బిఆర్ఎస్ పాలనలో అధికారులు ఆ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులుగా తప్పు చేసిన దానిని తప్పు అని చెప్తే కూడా ఇలాంటి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ప్రజల పక్షాన వారి సమస్యలపై ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిముద్దీన్ మజర్ మాలిక్ మార్క సతీష్ గౌడ్ బిక్షపతి బైరి సాయి గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు