పునరావాస కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలి: జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, సింగారం, ఏటిగడ్డ కిష్టాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్ మరియు వేములఘాట్ గ్రామాల సర్పంచ్, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల బాధితులకు పునరావాస కాలనీలలో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ పునరావాసంలో భాగంగా పునరావాస కాలనీలలో కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చిందని ఎవరికైనా రిజిస్ట్రేషన్ పూర్తిగా కాకపోతే త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కొన్ని కాలనీలో సిసి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు తదితర సౌకర్యాలను కల్పించామని ఏ పునరావాస కాలనీలోనైనా ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖల ద్వారా వెంటనే సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు రమేష్, బన్సీలాల్, విద్యుత్ శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.