పేద దళిత పాస్టర్లను ఆదుకుంటాం: ఎమ్మెల్యే సతీష్
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
పేద క్రైస్తవ దళిత పాస్టర్లకు దళిత బంధు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సతీష్ అన్నారు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గోని మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు ఏకతాటిపై ఉండాలని, నియోజకవర్గంలో క్రైస్తవ చర్చిల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు అయేవిదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా క్రైస్తవ సమాధుల కోసం 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, నియోజకవర్గంలోని పాస్టర్లకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని నూతనంగా ఏర్పడ్డ హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు..