పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది – డిప్యూటీ సీఎం మహమూద్ అలీ – వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందని డిప్యూటీ సీఎం ఎం, హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో రూపాయలు 23 కోట్లతో పోలీసుల కోసం నిర్మించిన బారక్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ బ్యారక్లో 450 మంది పోలీసు అధికారుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడినది చెప్పారు తెలిపారు. డైనింగ్ హాల్, బెడ్ తదితర అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జపాన్ లాంటి దేశాల వలె తెలంగాణ పోలీసు శాఖ మెరుగుపరుచుకున్నదని చెప్పారు. గతంలో పోలీస్ స్టేషన్కు రావాలంటే భయ పడేవారని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. పోలీసుల కోసం అత్యాధునిక అందమైన భవనాలు పోలీసుల కోసం నిద్రింప చేస్తున్నాడని అన్నారు. వెంట రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సి పి జోయల్ డేవిస్, పోలీస్ హౌసింగ్, అటవీ శాఖ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.