ప్రజల రక్షణ ముక్యం: జిల్లా ఎస్.పి పి.రోహిణి
పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని..
పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ బుదవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ వివరించారు. ఎస్పీ పి.రోహిణి అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, HRMS. ఆన్ లైన్ వినియోగించు విధానము, TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయలని, స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని, వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని వాహనదారులకు అవగాహనా కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సి.ఐ. శ్రీ.విజయ్, పాపన్నపేట్ ఎస్.ఐ.శ్రీ.విజయ్ నారాయణ్ సిబ్బంది పాల్గొన్నారు
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/503-17.jpg)