34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి: బండి

ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి: బండి

ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి: బండి

యదార్థవాది ప్రతినిది కరీంనగర్

* టీ ఎస్ పిఎస్సీ లీకేజీపై సెట్టింగ్ జడ్జితో
విచారణ చేయలి..
* 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అగన్య గోచరంగా మారింది..
* త్వరలో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం..

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో
అరెస్టై బైల్ పై శుక్రవారం కరీంనగర్ జైల్ నుండి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టి ఎస్ పిఎస్సీ పేపర్ లీక్ ప్రస్తుతం పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వలన రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినదని దీనికి బాధ్యున్ని చేస్తూ కేటీఆర్ ను మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించి లీకేజీ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని హిందీ పేపరు నేను లీకేజ్ చేసినట్టయితే మరి తెలుగు పేపర్ ఎవరు లీకేజీ చేశారు అని వరంగల్ సి పి నీ ప్రశ్నించారు. త్వరలో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహిస్తానని సింగరేణి ని ప్రైవేట్ పరం చేయడానికి కెసిఆర్ కుట్రలు పన్నుతున్నారని 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం వాటా కలిగి ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్