ప్రతీ పేద వారికి సంక్షేమ పథకాలు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
ప్రతీ పేద వారికి పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కుకునూర్ పల్లి మండలం కొనాయుపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించి ప్రజలతో మాట్లాడి సరిపడా దరఖాస్తులను అధికారులు అందిస్తున్నారా దరఖాస్తుల రిషిప్ట్ లు ఇస్తున్నారా అని అడిగి ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు ఒక మంచి అవకాశం ప్రతీ పేద వారికి పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని అన్నారు. ప్రజలకు కావాల్సిన దరఖాస్తులను అధికారులే ఉచితంగా అందిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా నేరుగా గ్రామపంచాయతీలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులను పూరించి అధికారులకు అందించాలని అన్నారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులను అందించేందుకు అవకాశం ఉందని ప్రజలకు తెలిపారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజాపాలన గ్యారంటీల ఫ్లెక్సీ కనపడేలా కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఒకరోజు ముందుగానే దరఖాస్తులను ప్రజలకు అందజేయ్యాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డిఓ బన్సీలాల్ మండల ప్రత్యేక అధికారి జిల్లా యువజన మరియు క్రీడ శాఖ అధికారి నాగేందర్ కుకునూరుపల్లి తహసిల్దార్ మల్లికార్జున్ సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.