ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
యధార్థ వాది ప్రతినిధి హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏచెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (DA) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 17.29 నుంచి 20.02 శాతానికి పెంచినట్లు తెలిపారు. డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.