ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రలో సరికొత్త అధ్యాయం
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కామారెడ్డి నందు నేడు ఐక్యుఏసి, టీఎస్ కేసి-టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ బహుళజాతి సంస్థ ” జెన్పాక్ట్ ” సంస్థలో ఉద్యోగాల కొరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు భారీ స్థాయిలో స్పందన లభించిందని సుమారు 400 మంది విద్యార్థులు హాజరవగా 112 మంది విద్యార్థులు ఎంపికవడం కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె కిష్టయ్య తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పట్టణ ప్రాంత విద్యార్థులతో పోటీ పడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రముఖ సంస్ధలలో ఉద్యోగాలు పొందడం కళాశాలకు గర్వకారణమని అన్నారు.
ఈ సందర్బంగా కంపెనీ ప్రతినిధులు నవాజ్ ,కోమల్ సువెష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఇంతమంది విద్యార్థులను ఎంపిక చేయడం చాల ఆనందం కలిగించిందని అన్నారు.టాస్క్ ప్రతినిధులు శ్రీనాథ్, లక్ష్మణ్ మాట్లడుతూ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులు అన్నీ రంగాల్లో ముందుంటున్నారు అని తెలిపారు. ఈ సందర్బంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అధ్యాపక సిబ్బంది అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్ అకాడమిక్ కో ఆర్డినేటర్ రాజ్ కుమార్ టి ఎస్ కే సి సమన్వయకర్త ఫర్హీన్ ఫాతిమా మెంటర్ అజహారోద్దిన్ అధ్యాపకులు డా.శంకర్ పాల్గొన్నారు.