ప్రేక్షకులతో సందడి చేసిన..బాలయ్య
హైదరాబాద్: 12 యదార్థవాది ప్రతినిది
రెండు తెలుగు రాష్టాల్లో ‘వీరసింహా రెడ్డి’ విడుదలైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భ్రమరాంబ థియేటర్‌లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షోలో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులతో సందడి సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు.. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌తో థియేటర్ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని బాలయ్య తెలిపారు. ఈ సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గురువారం వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి…