30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రైవేట్ ఫైనాన్స్ పై ఉక్కు పాదం

ప్రైవేట్ ఫైనాన్స్ పై ఉక్కు పాదం

ప్రైవేట్ ఫైనాన్స్ పై ఉక్కు పాదం

-ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించకుంటే కట్టిన చర్యలు
-కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు

కరీంనగర్ యదార్థవాది

ప్రైవేటు ఫైనాన్స్ లు చిట్ ఫండ్ కంపెనీల యాజమాన్యాలు ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు..
కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ప్రైవేట్ ఫైనాన్స్ లు, చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ గడువు ముగిసిన అవసరమైన సమయాల్లో చిట్ గ్రూప్ లోని సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందని ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అవసరానికి వారికి అందించకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని సంస్థలు ఏకంగా డబ్బుకు బదులు తక్కువ ధర గల భూములను ఎక్కువగా చూపిస్తూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించి గ్రూప్ సభ్యులకు కట్టబెడుతున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని ఆయన అన్నారు.
ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు కరీంనగర్ పోలీస్ శాఖ బాధితుల వెంట ఉంటుందని తెలిపారు. నిర్ణీత గడువు లోపు డబ్బులు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్యాలు వారి సంస్థల యొక్క పూర్తి వివరాలను కోరిన విధంగా అందజేయాలని ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలకు తాము వ్యతిరేకం కాదని చట్ట పరిధిలో పరిమితులకు లోబడి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పరిమితులను ఉల్లంఘించిన లేదా గ్రూపు సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థల యాజమాన్యాలకు కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ప్రైవేటు ఫైనాన్స్, చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్