30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబాల కార్మికులకు విముక్తి: జిల్లా ఎస్ పి రోహిణి

బాల కార్మికులకు విముక్తి: జిల్లా ఎస్ పి రోహిణి

బాల కార్మికులకు విముక్తి: జిల్లా ఎస్ పి రోహిణి

ఆపరేషన్ స్మైల్ 9 దాడులలో 98 మంది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ గత నెల రోజులుగా మెదక్ జిల్లా ఆపరేషన్ స్మైల్ 9 దాడులు నిర్వహించి బాలకార్మికులను విముక్తి కలిగించడం జరిగిందని, బట్టలషాప్ లలో, ఆటో మొబైల్ షాపుల్లో పని చేస్తున్న98 మంది బాల కార్మికులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 22 మంది అమ్మాయిలు, 76 మంది బాలురు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ 9 బృందం గుర్తించి పట్టుకున్న వారిని CWC DCPO వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్ పి తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కి కానీ 1098 కి కానీ కాల్ చేసి వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్ పి తెలిపారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్