బావండ్ల మల్లేశం మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐలో చిన్న తణం నుంచి ఎర్రజెండా పోరాట బాటలో సాగిన అనేక ప్రజా ఉద్యమాలకు అకర్షనీయులైన బావండ్ల మల్లేశం భూస్వాముల పెత్తందారీ వ్యవస్థ రూపుమాపడానికి స్వతగా పాటలు కౌగట్టి గళమెత్తిన పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి హుస్నాబాద్ ప్రాంతంలో సిపిఐ నేతలు ముస్కు రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం ఎల్లారెడ్డి,
దేశిని చిన మల్లయ్య, చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న బావండ్ల మల్లేశం
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం స్వగ్రామమైన పొట్లపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్ సిపిఐ నాయకులతో కలిసి శనివారం
ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఎర్ర జెండాను కప్పి పులమాలలు వేసి బావండ్ల మల్లేశంకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మౌటం బాలయ్య, జొన్నలగడ్డల కుమార్, నీలం రాజిరెడ్డి, రాదండ్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొని బావండ్ల మల్లేశం కుటుంబ సభ్యులైన ఈరవ్వ, రమేష్, నరేష్, పద్మ, అంజవ్వలను ఓదార్చి వారికి సిపిఐ నాయకులు మనోధైర్యం కల్పించారు…