27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణబీజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి. 

బీజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి. 

బీజేపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలి. 

పాలకుర్తి యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీని ఓడించాలని ఎంఎల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) పిలుపునిస్తుంది ఈ మేరకు శనివారం ఆ పార్టీ ఒక ప్రత్రిక ప్రకటన విడుదల చేసింది. స్థానిక నియోజకవర్గ అభ్యర్థిగా ఎంఎల్ పిఐ (రెడ్ ఫ్లాగ్) బుజందర్ మాన్యుపుని పోటీలో నిలబెట్టిందని ఆ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విన్నవించింది. పాలకుర్తి నియోజకవర్గానికి ఎంతో పోరాట చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగియున్నదని గుర్తు చేశారు. పోరాటాల గడ్డైపై అమరుల బాటలో పయనించే రెడ్ ఫ్లాగ్ అభ్యర్థి బుజెందర్ మాన్యపుని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సిపిఎం, ఎంసిపిఐ(యు), ఎంఎల్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచారని వారిని కూడా గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు తెలిపాయి. రెడ్ ఫ్లాగ్ నినాదం కమ్యూనిస్టులు ఐక్యత, కమ్యూనిస్టులే నిజమైన ప్రత్యామ్నాయం అనే నినాదంతో ఆలోచనతో ఆచరణతో ముందుకెళ్తున్న పార్టీ అని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం కలబడి పనిచేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీలేనని, కమ్యూనిస్టు నాయకులేనని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. భూమి కోసం భుక్తి కోసం దోపిడీ విముక్తి కోసం పనిచేసేది కమ్యూనిస్టు పార్టీలేనని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇతర పార్టీలన్నీ ఎన్నికల సమయంలో వారంతా ప్రజా సేవకులేనని మాటల గారడీ ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషణలేనని ఎన్నికల అనంతరం వారంతా ఒకటేనని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎర్రజెండా పార్టీ గెలిచినా ఓడిన ప్రజాసమస్యలపై పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మతం కులం ప్రాంతీయం ఉన్మాదాల్ని పెచ్చరిల్లేలాగా పాలించే బిజెపిని ఓడించాలని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని భగ్నం చేసి, దొర్ల పాలన కుటుంబం పాలన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీని కూడా ఓడించాలని ప్రజలకు రెడ్ ఫ్లాగ్ విజ్ఞప్తి చేస్తుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్