34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబీజేపీ లో చేరికలు.

బీజేపీ లో చేరికలు.

బీజేపీ లో చేరికలు.

కుకునూర్ పల్లి, కొండపాక యదార్థవాది 

గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక కుకునూరు పల్లి మండలాలలోని వివిధ గ్రామాల బీఅర్ఎస్ సర్పంచులు మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు బుధవారం గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ బడేకోల్  లావణ్య, మాజీ సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ  2001 తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటివరకు కష్టపడి పని చేసిన కొంతమంది కార్యకర్తలకు నాయకులకు బిఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదు, కొంతమంది పార్టీలో పెత్తందారి పోకడలతో  డబ్బున్నోళ్ల మాటలే చెల్లుబాటు అవుతున్నాయని నిజమైన కింది స్థాయి కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు కొరవడిందని అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు అనుభవించి వార్డు మెంబర్ నుండి సర్పంచ్ దాకా ఎదిగి మొదటిసారి నేను,  రెండో పర్యాయం మా భార్య లావణ్య సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాం, గ్రామ పంచాయతీకి సంబంధించి ఖర్చులకు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ డీజిల్ కావచ్చు గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు కావచ్చు ఇతర మెయింటెనెన్స్ ఖర్చులకు గాను నెల నెల  అప్పులు చేసి నెట్టుకొస్తున్నామని 2018 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయడం లేదని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన నిధులతోనే కాలం గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సర్పంచ్ గా పార్టీ కోసం కష్టపడితే ఇపుడు  కొంతమంది నాయకుల దగ్గర కనీస విలువ మర్యాదలు లేకుండా పోయాయని కేవలం ధనిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని నిజమైన ఉద్యమ కారులమైన మాకు అన్యాయమే మిగిలిందని ఈ అన్యాయాలను అరికట్టాలంటే బిజెపి ప్రభుత్వం రావాల్సి ఉందని బీసీ నాయకత్వం ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆరెస్ నుండి బీజేపీ లోకి నాతో మొదలైన ఈ చేరికలతో ఇంకా చాలామంది నాయకులు బిజెపిలో చేరడానికి సమాయత్తం అవుతున్నారని అన్నారు. అంకిరెడ్డి పల్లి గ్రామం నుండి బడే కోల్ రమేష్ తాళ్లపల్లి చంద్రయ్య చెన్న సత్తయ్య తాళ్లపల్లి యాదగిరి తాళ్లపల్లి ప్రవీణ్,  దొరకునాల మురళి చాకలి మహేష్ తో పాటు కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన పిట్ల మల్లేశం ఆధ్వర్యంలో 40 మంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్