పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సభ్రత ముఖర్జీ కన్నుమూశారు. గుండెపోటుతో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కాగా బాత్రూంలో కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలియగానే సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లారు 1971లో 25 ఏళ్ల వయసులోనే సభ్రత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు 1972లో మంత్రి అయ్యారు.