34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణభాగ్యనగరంలో మరో భారీ మోసం.. బ్యాంకులో నగదు ఫ్రీజ్...

భాగ్యనగరంలో మరో భారీ మోసం.. బ్యాంకులో నగదు ఫ్రీజ్…

భాగ్యనగరంలో రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యుల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎంత అందుతే అంత దోచేస్తున్నారు. బిట్ కాయిన్ క్రిష్టోకరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు వసూలు చేసిన మరో ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. క్రిష్టోకరెన్సీ పేరుతో భారీ మోసం పాల్పడిన ముఠా అరెస్టు చేశామని సీపీ తెలిపారు. క్రిష్టోకరెన్సీ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠా మాయమాటలు నమ్మి నార్కట్పల్లి కి చెందిన ఒక వ్యక్తి 85 లక్షలు పోగొట్టుకున్నారని తెలిపారు. 14 సేల్ కంపెనీల ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడి నట్లు గుర్తించామన్నారు. వారి చేతిలో మోసపోయిన మరో బాధితుడు బానోత్ కిరణ్ కుమార్ ఫిర్యాదుతో ప్రత్యేక టీం తో దర్యాప్తు చేశామన్నారు.
బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. పశ్చిమ బెంగాల్ కు ప్రత్యేక టీమ్ ని పంపించి అరెస్టు చేసినట్లు చెప్పారు బ్యాంకు లో ఉన్న రూ.50 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశామని తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించామని.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్