భారత రాజ్యాంగలో సోషలిస్టు నిబంధనలు అమలుకై: హైకోర్టులో కేసు
అమరావతి యదార్థవాది ప్రతినిధి
భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న సోషలిస్టు నిబంధనను తక్షణమే అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది తోట సంగమేశ్వర రావు కేసు దాఖలు చేశారు.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్న సోషలిస్టు నిబంధన రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చబడి ఇప్పటికీ అమలుకు నోచుకోని సోషలిస్టు నిబంధనములు అమలు చేస్తే భారత దేశంలోని వనరులన్నీ జాతీయం చేయడంతో దేశంలో దారిద్రం నిరుద్యోగం వంటి రుగ్మతలు తొలగిపోతాయని ఆర్థికంగా అసమానతలు తొలగిపోయి సమానత్వ స్థితి రావడం ద్వారా మౌలిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆ విధంగా ఉత్తమ సమాజం రూపుదిద్దుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.