23.5 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్జాతీయమంత్రులకు భాష రాదు..సీఎస్ ను మార్చండి ముఖ్యమంత్రి లేఖ...

మంత్రులకు భాష రాదు..సీఎస్ ను మార్చండి ముఖ్యమంత్రి లేఖ…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక విషయంలో ముఖ్యమంత్రి లేఖ రాస్తూ మిజోరం మంత్రులకు హిందీ అర్థం కాదని కొంత మందికి ఇంగ్లీష్ కూడా తెలియదని.. మిజో వచ్చిన అధికారిని. ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరారు.కొత్తగా నియమించిన ప్రధాన కార్యదర్శి కి విజ్జు భాష తెలియదని ఆయనను తప్పించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి జేసి రామ్ థంగాను ఎస్ రేణు శర్మ స్థానంలో నియమించాలని లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ కేడర్ కు చెందిన చీఫ్ సెక్రెటరీ లల్నున్మవియా చువాగో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జేసి రామ్ థంగా ( మణిపూర్ క్యాడర్ ) ని నియమించాలని కోరారు. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను కొత్త గా ప్రధాన కార్యదర్శి గా ఇచ్చిందని లేఖ రాశారు. అరుణాచల్ ప్రదేశ్ ,గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT ) ఐ ఎస్ క్యాడర్ 1988 బ్యాచ్కు చెందిన రేణు శర్మను అక్టోబర్ 28న మిజోరామ్ కు సిఎస్ గా నియమించింది. ఆమె నవంబర్ 1న సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు, అయితే అదే రోజున జె సి జేసి రామ్ థంగా నియమిస్తూ మిజోరాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిజోరంలో ఇద్దరు చీఫ్ సెక్రటేరియల్ గా కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మిజోరామ్ ప్రజలకు పెద్దగా హిందీ అర్థం కాదని, న మంత్రి మండలిలోనే ఎవరికీ హిందీ రాదని, కొందరికి ఆంగ్ల భాష తో సమస్యలు ఉన్నాయి.. ఈనేపథ్యంలో మిజోరామ్ భాష పై అవగాహన లేని చీఫ్ సెక్రటరీ, సమర్థవంతమైన ప్రధాన కార్యదర్శి కాలేరు.. మిజోరామ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి స్థానిక భాష తెలియని ప్రధాన కార్యదర్శిగా భారత ప్రభుత్వం ఎన్నడూ నియమించలేదు. ఈశాన్య రాష్ట్రాలలో మొదటి నుండి ఇప్పటి వరకు ఎన్డీఏ నమ్మకమైన భాగస్వామి గా ఉన్న వారిలో నేను ఒకరిని.. కాబట్టి, కన్నీటిని పరిగణలోకి తీసుకొని, ప్రతిపాదనను దయచేసి అంగీకరించ వలసిందిగా అభ్యర్థిస్తున్నాముఅని లేఖలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్