యూరప్ లో కరోణ మళ్లీ విజృంభిస్తుండడం తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నాటికి 5 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. యూరప్ లోని 53 దేశాల్లో కోవిడ్ తీవ్రస్థాయికి చేరే ప్రమాదముందని హెచ్చరించింది. మరో వైపు జనవరి 4 లోగా వాణిజ్య సంస్థల్లో పని చేసేవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది.