మహిళను కాపాడిన పోలీసులు
యదార్థవాది ప్రతినిధి ప్రకాశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోతున్న సమాచారాన్ని గిద్దలూరు జర్నలిస్ట్ సహాయంతో తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కాపాడారు. భర్తతో విభేదాలు రావడంతో మనస్థాపన చెందిన మహిళ తన ఐదు సంవత్సరాల తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను చిన్నారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఎస్ఐ బ్రహ్మనాయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు.తర్వాత వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను కాపాడిన పోలీసులను జర్నలిస్ట్ లను ప్రజలు అభినందిస్తున్నారు.