37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ముమ్మరంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పనులు..

ముమ్మరంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పనులు..

ముమ్మరంగా తిరుపతి రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణం పనులు..

  • ముమ్మరంగా కొత్త స్టేషన్ భవన నిర్మాణం
  • 60% మేర భవన నిర్మాణం పనులు పూర్తి.
    తిరుపతి రైల్వేస్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఈ పి.సి విధానంలో సుమారు 300 కోట్ల వ్యయంతో, నిర్ణిత గడువు ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేసి రాబోయే 40 సంవత్సరాలకు అనుగుణంగా ప్రయాణీకుల అవసరాలను దృష్టితో స్టేషన్ పనులు జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్‌కు దక్షిణం వైపున పనులు, కొత్త స్టేషన్‌ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జియోలాజికల్ సర్వే పూర్తయిన తర్వాత, క్యాంప్ ఆఫీస్, కాంక్రీట్ ల్యాబ్, స్టోరేజ్ షెడ్‌ల పనులు జరుగుతున్నారు. భూగర్భ పార్కింగ్, బేస్మెంట్ నిర్మించేందుకు పనులు దాదాపు పూర్తయ్యాయి.తిరుపతి స్టేషన్ పునరాభివృద్ది కి సంబందించిన ప్రతిపాదిత నమూనాను స్టేషన్ ప్రవేశద్వారం వద్ద సాధారణ ప్రజలకు ప్రదర్శన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ని సందర్శించారు. రైల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తిరుపతి స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించామనరు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రతి దశలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నమని, నిర్మాణ సంస్థకు పూర్తి సహకారం అందించాలని రైల్వే అధికారులకు, సిబ్బందిని ఆదేశించారు
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్