యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్
-గజ్వేల్ నియోజకవర్గంలో యువతి యువకులు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ సద్వినియోగం చేసుకోవాలి
కొండపాక యదార్థవాది
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులకు ఒక్కరికి కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే ఉద్దేశం తో గజ్వేల్ నియోజకవర్గంలో అర్హులైన అందరికి రెండూ, నాలుగు చక్రాల వాహనాలకూ లైసెన్స్ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నాడని కొండపాక మండల బిఆరెస్ పార్టీ అధ్యక్షుడూ నూనె కుమార్ యాదవ్ పత్రిక ప్రకటనలో తెలిపారు.. ప్రతి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లకు ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, లేదా బర్త్ సర్టిఫికెట్, స్కూల్ బోనోఫైడ్ జిరాక్సులు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలని జులై 11వ తేదీ లోపు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవలని అన్నారు.