22.1 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణరాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

యదార్థవాది ప్రతినిది కామారెడ్డి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎలుగుబంటి సంచారించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాగట్లపల్లి గ్రామ ప్రజలు గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు గ్రామస్తులకు మూడు రోజులుగా ఎలుగుబంటి ఊళ్లో తిరుగుతూ కనిపిస్తూ ఉందని గ్రామస్తులు, ఎలుగుబంటి గ్రామపంచాయతీ ఆవరణలో చెట్లపదల్లోకి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులకు తెలిపారు. జిల్లా అడవి శాఖ అధికారి సిబ్బందితో రాగట్లపల్లి గ్రామానికి చేరుకొని ఎలుగుబంటి తిరిగే ప్రాంతాన్ని పరిశీలించి. వరంగల్ అడివిశాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రిస్క్ టీం వరంగల్ ఆపరేషన్ వైద్యుడు ప్రవీణ్ కుమార్ బృందం ఘటన స్థలానికి చేరుకొని మెదక్ జిల్లా పర్వతాపూర్ గ్రామం నుంచి జెసిపి వాహనాన్ని రప్పించారు వాహనంతో గుండు రాళ్లను ముళ్లపదలను మొదట తొలగించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని రిస్క్ టీం బృందం సభ్యులు మత్తు ఇంజక్షన్లను రెఫెల్తో షూట్ చేశారు దీంతో ఎలుగుబంటి 20 నిమిషాల్లో మత్తులోకి జారుకుంది. అడవిశాఖ సిబ్బంది డి ఎఫ్ ఓ ఆధ్వర్యంలో ఎలుగుబంటిని వలలో బంధించి తీసుకువెళ్ళారు. గురజాగుంట, రాగట్లపల్లి, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలుబంటిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలించారు. ఎలుగుబంటిని పట్టుకోవడానికి సహకరించిన గ్రామస్తులకు రిస్క్ టీమ్స్ సిబ్బందికి పోలీసులకు అడవి శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలుగుబంటి వయసు 12 సంవత్సరాల వరకు ఉంటుందని డిఎఫ్ఓ నికిత తెలిపారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్