లోకేష్ పాదయాత్ర ఆగదు: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: యదార్థవాది ప్రతినిది
అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయనా యువగళం పాదయాత్ర ఆగదు..
అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా యువగళం పాదయాత్ర జరిగి తీరుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు.సోమవారం టెక్కలిలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ… రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ నే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు సీఎం చంచాగాళ్లలా పనిచేస్తున్నారని విమర్శించారు. ”అసలు డీజీపీ ఐపీఎస్ చడివాడా?.. లేక దొంగ సర్టిఫికెట్లుతో వచ్చాడా” అంటూ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో చాలా మంది సీఎంలు పనిచేశారని… జగన్ లాంటి సైకో ముఖ్యమంత్రిని చూడలేదని, పిచ్చి సైకో పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.