విగ్రహ ప్రతిష్ట మహోత్సవము
శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, ప్రతినిధి, డిసెంబర్ 12: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గంగారం తాండాలో శ్రీ జగదాంబ దేవి, శ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీ రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు స్వస్తి శ్రీ క్రొది నామ సంవత్సరం మార్గశిర శు” త్రయోదశి తేది:13-12-2024 ప్రారంభమై శు” పౌర్ణమి తేది: 15-12-2024 ఆదివారం వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ అద్వితీయ మహోన్నత కార్యక్రమాన్ని అధిక మొత్తంలో భక్తులు హాజరై విజయవంతం చేయవలసిందిగా గంగారం తాండ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరుపున కోరారు.