విద్యార్థిని బలిగొన్న ఇంటర్ భూతం
హైదరాబాద్ నారాయణ కాలేజీ
విద్యార్థి ఆర్మూర్ లో ఆత్మహత్య
ఆర్మూర్ యదార్థవాది
ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణ ఘోషకు ఇంకా ముగింపు పలకనట్లే ఉంది. అటు కార్పొరేట్ కాలేజీల ఒత్తిళ్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు ఆశలు వెరసి విద్యార్థులు ఒత్తిడులకు లోనవుతూ చివరకు తనువు చాలిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే రీతిన చాలా మంది పరీక్ష ఫలితాల్లో ఆశించిన మార్కులు రాలేదన్న భేంగతో పరీక్షల్లో తప్పమనే రోదనలతో ఉరితాల్లకు భాలైన సంగతి విదితమే. యేసారి కూడా అదే పరిస్తితి పునరావృత అయింది. ఫలితాలు వెల్లడించే ముందు విద్యార్థుల్లో కనీసం వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం వుంది.
ఉరికి వెల్లాడిన ఆశలు
ఆర్మూర్ లో నారాయణ కాలేజ్ విద్యార్థి ఇంటర్ ఫెయిలైన కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కుమారుడు ప్రజ్వల్ (17) ఇంటర్ ఫస్టియర్ హైదరాబాద్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రజ్వల్ ఫెయిల్ అయిన కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కు ఒక కుమార్తె, ఓ కుమారుడు సంతానం. ఎదిగిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో బాధిత కుటంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రజ్వల్ మృతి చెందడంతో ఆర్మూర్ లోనలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/05/IMG-20230509-WA0015-1-1024x473.jpg)