32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణవిద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం

విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం

విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాంగ్రస్ ప్రభుత్వం

 -రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14:  విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు  కొండ సురేఖ అన్నారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు.  ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి  మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 80 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 21,680 మంది  అన్ని ప్రభుత్వ,సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతుంది అన్నారు. డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవం విద్యార్థుల నాణ్యమైన పౌష్టికాహారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా  యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు అందించామన్నారు.  విద్యార్థిని విద్యార్థులు, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా  విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. డైట్ చార్జీల గురించి వివరిస్తూ మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే విద్యార్థులకు 950 ఉన్న డైట్ చార్జీలను 1330కి పెంచడం జరిగిందన్నారు, 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు 1160 ఉన్న డైట్ చార్జీలను 1540కి పెంపు చేయడం జరిగింది అన్నారు ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు చదువుకునే  విద్యార్థులకు 1500 రూపాయలు ఉన్న డైట్ చార్జీ ఇప్పుడు 2,100 పెంచడం జరిగిందన్నారు, కాస్మోటిక్ ఛార్జీల గురించి వివరిస్తూ 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాల బాలికలకు 55 నుండి 175 రూపాయలు పెంపుదల చేసినట్లు వివరించారు, మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు  62 రూపాయల నుండి150 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాలు దాటిన బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు  62 రూపాయల నుండి 200 రూపాయలు పెంచడం జరిగిందన్నారు . కాస్మోటిక్ డైట్ చార్జీల పెంపుతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, కనపడిందని వివరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇకనుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని, కొత్త డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్