విమానాశ్రయ నిర్మాణసమస్యను పార్లమెంటులో లేవనేత్తిన..ఎంపీ శ్రీ జీవీఎల్
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2500 కోట్ల పెట్టుబడి , భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అయిన తరువాత 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ప్రస్తుత ఎయిర్‌పోర్టులో కార్యకలాపాల నిలిపివేత…ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ లికితపుర్వక సమాధానం.. మంగళవారం రాజ్యసభలో ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు భోగాపురం విమానాశ్రయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ లికితపుర్వక సమాధానమిస్తూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి భారత ప్రభుత్వం జనవరి, 2016లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (GoAP) నిర్మాణ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ‘సూత్రప్రాయంగా’ భారత ప్రభుత్వం అక్టోబర్, 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించిందనీ, భోగాపురం విమానాశ్రయాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని, విమానాశ్రయం అభివృద్ధికి సుమారు 2203 ఎకరాల భూమి అవసరమని, విమానాశ్రయం యొక్క మొదటి దశ నిర్మాణం ద్వారా సంవత్సరానికి 6 మిలియన్ల ప్రయాణీకులకు ప్రయాణ సేవలను అందించగలదని మంత్రి తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి ప్రాథమిక అంచనా వ్యయం సుమారుగా రూ. 2500 కోట్లు అని, విమానాశ్రయ పూర్తి నిర్మాణం భూసేకరణ, తప్పనిసరి అనుమతుల లభ్యత, ఆర్థిక మూసివేత వంటి అనేక అంశాలపై, రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ప్రస్తుత వైజాగ్ నేవల్ ఎయిర్‌ఫీల్డ్‌లోని 373 ఎకరాల విశాఖపట్నం విమానాశ్రయం తిరిగి AAI కి అప్పచెప్పబడుతుందని మంత్రి తెలిపారు.