వేసవిలో వరి పంట వేయొద్దని తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. విత్తనం కోసమే వరి వేయాలని, రాష్ట్రంలో వరి కొనే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వానాకాలం లో వేసే వరి పంటను ఖచ్చితంగా కొంటామని స్పష్టం చేసిన ఆయన యాసంగి పంట కొనమని చెప్పారు. బీజేపీకి దమ్ముంటే కేంద్రం వరి కొంటుందని లెటర్ ఇవ్వాలని అన్నారు.