సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
-ఘనంగా మోదీ 73వ జన్మదిన వేడుకలు.
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఆదివారం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వేములవాడ హరికృష్ణ, ఉట్లపల్లి సురేష్, రాందాస్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.