34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసమస్యల సుడిగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం

సమస్యల సుడిగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం

సమస్యల సుడిగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం

*అవినీతి అక్రమాలతో కాంగ్రెస్ పాలన పతనం
*రేవంత్ ది పూటకో మాట రోజుకు డైవర్షన్
-వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 16:
స్కామ్లు, స్కీములు, అవనితి, అక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ లో సోమవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి పూటకో మాట మార్చుతూ రోజుకు డైవర్షన్ అనుసరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలన్నీ సగానికి పరిమితం చేస్తూ ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని, రుణమాఫీకి సగం నిధులను కేటాయించి సగం మంది రైతులను నట్టేట ముంచిందన్నారు. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు లేక పారిశుద్ధ్యం ఇతర నిత్యవసర పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 67 లక్షలు మంది రైతులకు 49 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయవలసి ఉండగా రూ 20 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని మరో 29 వేల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉందని తద్వారా సగం మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. పెట్టుబడి సహాయం ఇంకా ఊసేయలేదని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ 2500 ఇస్తామని ఇంకా అమలుకు నోచుకోలేదని, వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ 4000 పెన్షన్ పెంచుతామని ఇప్పటివరకు పెంచలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. గురుకులాల్లో సరైన ఆహారం అందించకపోవడంతో పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందడం, అనేకమంది విద్యార్థులు అస్వస్థత గురవడం దారుణం అన్నారు. రేవంత్ సర్కార్ లక్షల కోట్ల అప్పుచేసి ప్రజల నెత్తిన రుణభారం పెంచుతుందన్నారు. పత్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నామ్కే వాస్తే ప్రారంభించి రైతులను సమస్యలకు సుడిగుండంలో నెట్టిందన్నారు. బోనస్ ధాన్యముకు బోనస్ సరిగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఫైలు కదలాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందేనని అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పరిపాలన మరోసారి చరిత్రలో నిలుస్తుంది అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు ప్రజల పనుల కోసం కమిషన్ లు నొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకోసారి ఢిల్లీకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్