సర్పంచ్‌ల నిధులను దొంగిలిస్తోంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 9 యదార్థవాది ప్రతినిది
రాష్ట్ర ప్రభుత్వం 35 వేల కోట్ల సర్పంచ్‌ల నిధులను దొంగిలిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ‘నిధులు, విధులపై సర్పంచ్‌ల శంఖారావం’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామా పంచాయతీల అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్‌లు పనులు చేశారు, ప్రభుత్వం సకాలంలో బిల్లులు రాక.. కొందరు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గ్రామపంచాయతీల నిధులను గుత్తేదారులకు ఇచ్చారని, గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌కే చెందుతుందని రేవంత్ అన్నారు. ఈ ఏడాది కేవలం జీతాల కోసమే ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుతెచ్చిన కేసీఆర్.. ఇంకా మూడు నెలలపాటు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఇప్పటి వరకు రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై రూ.1.5 లక్షల అప్పు మోపిందని, జీహెచ్‌ఎంసీకి బ్యాంకుల్లో రూ.600 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవని, కేసీఆర్ పాలనలో జీహెచ్‌ఎంసీకి అప్పు పుట్టని పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రాష్టం నెంబర్ వాన్ అంటూ గొంతు చించుకుంటున్న కేసీఆర్ రాష్ట్రానికి ఏమిచేయలేదు. కాంగ్రెస్, తెదేపా అధికారంలో ఉన్నాప్పుడు సర్పంచ్‌లకు గౌరవం ఉండేదని, ఎంఆర్వో ఆఫీసుకు వెళ్లినా, ఎంపీడీవో ఆఫీసు వెళ్లినా సముచిత గౌరవం దక్కేదని అన్నారు.