సీఎం కప్పు 2024 క్రీడా పోటీలు ముగింపు.
-గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం
వెల్దుర్తి/మాసాయిపేట్, యదార్థవాది, డిసెంబర్ 12
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన సుపరిచితంగా పరిపాలించిందని ఉద్దేశంతోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు సురక్షిత ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతోనే మండల కేంద్రాలలో సీఎం కప్ 2024 కార్యక్రమం ద్వారా క్రీడా పోటీలను నిర్వహించాలని అనే ఆదేశాల మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత మంగళవారం నుండి గురువారం వరకు నిర్వహించినటువంటి క్రీడా పోటీలలో గెలుపొందిన జట్లకు గురువారం బహుమతులను ప్రదానోత్సవం చేసిన ప్రజా నాయకులు అధికారులు కబడి ప్రథమ స్థానంలో వెల్దుర్తి గ్రామం రెండవ స్థానంలో కుక్నూర్ గ్రామం కైవసం చేసుకున్నాయి వాలీబాల్ మొదటి స్థానం మానేపల్లి రెండవ స్థానం కుకునూరు గ్రామాలు గెలుచుకున్నాయి కోకో క్రీడలో మొదటి స్థానం వెల్దుర్తి రెండవ స్థానం కుక్కునూరు కైవసం చేసుకున్నాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అంగడిపేట సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ నాలా చెరువు కిష్టగౌడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పాఠశాల సిబ్బంది ఎంపీడీవో ఉమాదేవి లు బహుమతులను అందజేశారు.