27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసేవాతత్వం చాలా గొప్పది

సేవాతత్వం చాలా గొప్పది

సేవాతత్వం చాలా గొప్పది

కొండపాక యదార్థవాది

స్వార్ధం లేని సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయమని, మనిషి జన్మ ఎత్తాకా సాటి మనిషి కోసం , సమాజం కోసం మంచి చేసే ఆలోచన ప్రతి మనిషి కి అవసరం అని వైస్ ఎంపీపీ దేవీ రవీందర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని దుద్దెడ జాగృతి ఫ్రెండ్స్ అసోసియేషన్ 24వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జాగృతి సంఘ అధ్యక్షుడు కాసాని బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవి రవీందర్ రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవకు గమ్యం ఎంచుకోకుండా ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం అంతఃకరణ శుద్ధితో సేవ చేయడం అభినందనీయం అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు యువజన సంఘాలకు జాగృతి ఫ్రెండ్స్ ఆదర్శంగా నిలుస్తుంది కొనియాడారు. కాగా దుద్దెడ గ్రామానికి చెందిన హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులు వైద్యుల పవన్ కళ్యాణ్ , మైలారం అజయ్ కుమార్లు బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు కైవసం చేసుకున్న సందర్భంగా వారిరువురికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 20 గ్రాముల వెండి పథకంతో పాటు నగదు ముట్టజెప్పారు. ఇది ఇలా ఉండగా స్థానిక ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు విద్యార్థులు ఇద్దరికీ తల రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కాగా అంతకుముందు కార్గిల్ అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి సంఘ సభ్యులతో పాటు అతిధులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్, ఎంపీటీసీ గురజాడ బాలాజీ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మంచాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పెద్దాంకుల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు అనంతల నరేందర్, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ మల్లమారి రవీందర్, చంద్రబాను సంఘ సభ్యులు వడ్లకొండ శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, నరహరి, నాగరాజు, హరీష్ , వెంకటరమణ మల్లెష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్